అక్కడి నుంచి బీజేపీ విజయం ఖాయమే

సర్పరాజ్​ రాజీనామాతో రంగంలోకి కల్పనా సోరెన్​ అవినీతి, అక్రమాలతో మసక బారిన ప్రతిష్ఠ

Apr 25, 2024 - 20:35
 0
అక్కడి నుంచి బీజేపీ విజయం ఖాయమే

రాంచీ​: ఝార్ఖండ్​​ మాజీ సీఎం సోరెన్​ సతీమణి కల్పనా సోరెన్​ రాజకీయాల్లోకి దిగనున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అడుగిడనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టాన పెద్దలు గురువారం ఆమె పేరును ప్రకటించారు. ఝార్ఖండ్​ లోని గాండే అసెంబ్లీ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశారు. మే 20న ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ స్థానం నుంచి జేఎంఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్​ పేరును ప్రకటించింది. గాండే నియోజకవర్గ ఎమ్మెల్యే సర్పరాజ్ అహ్మద్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆమె పోటీ నిశ్చితమైంది. ఈమె పోటీలోకి దిగుతున్న స్థానం నుంచి బీజేపీకి చెందిన దిలీప్​ కుమార్​ వర్మ పోటీలో ఉన్నారు. 

ఇప్పటికే మనీలాండరింగ్​ కేసులో హేమంత్​ సోరెన్​ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఝార్ఖండ్​ కు సీఎంగా చంపయ్​ సోరెన్​ వ్యవహరిస్తున్నారు. అవినీతి, అక్రమాల నేపథ్యంలో హేమంత్​ సోరెన్​ అరెస్టు కావడంతో ఆయన ప్రతిష్ఠ మసకబారినట్లు పలు సర్వేల ద్వారా స్పష్టం అవుతోంది. గాండే స్థానం నుంచి దిలీప్​ విజయం తథ్యమే అనే వాదన బలంగా వినిపిస్తోంది.