ఒడిశా పర్యటనలో రాష్ట్రపతి
President Droupadi Murmu visited Madhupur in Sambalpur district
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు శనివారం రాష్ట్రపతి భువనేశ్వర్ నుంచి ఝార్సుగూడకు బయల్దేరి, రాయఖోల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు. ఈ మేరకు కేంద్ర మంత్రితో కలిసి ఆమె రాష్ట్రంలోని సంబల్‌పూర్ జిల్లా మధుపూర్ చేరుకున్నారు. అక్కడ19వ శతాబ్దపు సాధువు, కవి, సంఘ సంస్కర్త అయిన శాంత కబీ భీమా భోయ్ అబిర్‌బాబా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శాంత కబీ భీమా భోయ్ విగ్రహానికి నివాళులర్పించారు. సంబల్‌పూర్‌లో పలు ఇతర కార్యక్రమాలకు హాజరుకానున్న రాష్ట్రపతి ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.