పోలీసు కార్యాలయాల నిర్మాణానికి ఏర్పాట్లు
Arrangements for construction of police offices
నా తెలంగాణ, నిర్మల్: ఇప్పటివరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇతర శాఖల భవనాల్లో పని చేస్తున్న పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు కార్యాలయాలు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, స్పెషల్ పోలీసు సిబ్బంది మహిళా డిగ్రీ కళాశాల భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కార్యాలయాల ఏర్పాటుకు అనుమతులు రావటంతో నిర్మాణం కోసం ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లపెల్లి సమీపంలోని సర్వే నెంబర్ 459లో ఈ కార్యాలయాల ఏర్పాటుకు ప్రాథమికంగా నిర్ధారించారు. నూతనంగా నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయాల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ జానకీ షర్మిల, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసీల్దార్ రాజు తదితరులున్నారు.