వాషింగ్టన్ డీసీ: క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్- క్యూఎస్ డీ) నాలుగో సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం సెప్టెంబర్ 21న అమెరికాలో జో బైడెన్ అధ్యక్షతన విల్మింగ్టన్, డెలావేర్‌లో నిర్వహించనున్నారు. క్వాడ్ ను ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ల మధ్య భద్రత, సుస్థిరతల కోసం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా ఆయా దేశాల్లోని ద్వైపాక్షిక అంశాలు మరింత బలోపేతం చేయనున్నారు. ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంతం భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోనున్నారు.
మోదీతోపాటు ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ యొక్క ప్రధాన మంత్రి కిషిడా ఫుమియోలు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ఆరోగ్య భద్రత, ప్రకృతి విపత్తులు, సముద్ర భద్రత, నాణ్యత, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సాంకేతక అంశాలు, వాతావరణం, క్లీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించనున్నారు.