రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం

సకాలంలో గుర్తించిన గ్యాంగ్​ మెన్​, తప్పిన ముప్పు వీడియో విడుదల చేసిన రైల్వే శాఖ

Sep 21, 2024 - 14:12
 0
రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం

గాంధీనగర్​: గుజరాత్​ లోనూ రైలు పట్టాలు తప్పించేందుకు ముష్కరులు కుట్రలు పన్నారు. పట్టాలపై శుక్రవారం రాత్రి ఫిష్​ ప్లేట్​ ను ఉంచినట్లు శనివారం రైల్వే శాఖ సామాజిక మాధ్యమాలు, మీడియాకు వీడియో విడుదల చేసి విషయాన్ని వివరించింది. పశ్చిమ రైల్వే, వడోదర డివిజన్​ కిమ్​ రైల్వేస్టేషన్​ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది. పట్టాలను తనిఖీ నిర్వహిస్తున్న గ్యాంగ్​ మెన్​ ఈ విషయాన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేశాడని తెలిపారు. అదే సమయంలో ముందుకు వెళ్లి రైలును ఆపేలా చర్యలు తీసుకున్నాడని తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యిందన్నారు. పట్టాలకు అనుసంధానించిన నట్​ బోల్టులను కూడా దుండగులు ఊడబీకారాని గుర్తించినట్లు తెలిపారు. వీటిని సరిచేశాక ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించామన్నారు. దీనివెనుక ఎవరున్నా కోణంలో, పోలీసులు, రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.