అవినీతిని రాజీవే అంగీకరించారు

సవాల్​ ను స్వీకరించే దమ్ము ఎవ్వరికీ లేకుండా పోయింది ఉత్తరాఖండ్​ ఎన్నికల సభల్లో కేంద్రమంత్రి రాజ్​ నాథ్​ సింగ్​

Apr 12, 2024 - 19:30
 0
అవినీతిని రాజీవే అంగీకరించారు

నైనిటాల్​: వంద పైసలు పంపినా 14 పైసలు కూడా ప్రజల వద్దకు చేరడం లేదని అంతలా అవినీతి ఉందని స్వయంగా రాజీవ్​ గాంధీ స్వయంగా అంగీకరించేవారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ఈ సవాలును స్వీకరించాలంటే ఆ పార్టీ (కాంగ్రెస్​) నేతలకే దమ్ము లేకపోవడం విచారకరమన్నారు.  శుక్రవారం ఉత్తరాఖండ్​ లోని మూడు ఎంపీ స్థానాల్లో మంత్రి రాజ్​ నాథ్​ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అవినీతి అక్రమాలు చేసిన కాంగ్రెస్​ నేతలే జైలుకు వెళ్లారని అన్నారు. నీతి నీజాయితీ పరులైన బీజేపీ నేతలెవ్వరూ జైలుకు వెళ్లలేదని అన్నారు. తాను ఏ పార్టీని, ఏ ప్రధానిని విమర్శించడం లేదన్నారు. నీతి, నిజాయితీ లేని వ్యక్తులనే మాత్రమే విమర్శిస్తున్నానని, ప్రశ్నిస్తున్నానని అన్నారు. వారి అంతర్మాత్మ ప్రబోధం ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదని నిలదీశారు. అవినీతి సంపాదనతో మేడలు, మిద్దెలు కడుతున్నారే తప్ప దేశంలో బ్రతకాలంటే సుఖశాంతులు అవసరం లేదా? అని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయాన్ని రాజీ గాంధీ చాలా నిజాయితీతో ఒప్పుకున్నారని తెలిపారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇలాంటి ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకునే ప్రధాని మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దేశంలోని నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు వందకు వంద శాతం అందాలన్నదే తమ అభిమతమన్నారు. 

కాంగ్రెస్​ అంతం ఖాయం..

అతి త్వరలోనే కాంగ్రెస్​ పార్టీ అంతరించిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికే హస్తం పార్టీలో లాబీయింగ్​ లు, అంతర్గత గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఆ పార్టీ తీరే ఓ బిగ్​ బాస్​ హౌజ్​ లా మారిందని మండిపడ్డారు. రోజూ ఒకరి గుడ్డలు మరొకరు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బలంగా భారత్​ వాణీ..

అంతర్జాతీయ వేదికలపై భారత్​ వాణిని బలంగా వినిపించే దేశం ఏదైనా ఉందంటే అది బీజేపీయేనన్నారు. దీంతోనే అనేకమంది భారతీయులను ఉద్రిక్తత తలెత్తిన దేశాల్లో నుంచి కూడా సురక్షితంగా తీసుకురాగలిగామని పేర్కొన్నారు. భారతీయుల క్షేమం,  భాగస్వామ్యం కోసం యుద్ధాలను సైతం నిలిపివేసే సత్తాను కేంద్ర ప్రభుత్వం సాధించిందని తెలిపారు. 

దేశీయంగానే రక్షణ పరికరాల ఉత్పత్తి..

ప్రస్తుతం దేశీయంగానే అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ఉన్న రక్షణ పరికరాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా రక్షణ రంగ ఎగుమతులు రూ. 600 కోట్ల నుంచి రూ. 21వేల కోట్లకు పెంచగలిగామని తెలిపారు. 

కాంగ్రెస్​ పార్టీ అయోధ్య, ఆర్టికల్​ 370, భారతీయుల క్షేమం తదితరాలపై ఏనాడైనా ఆలోచించిందా? అని కేంద్రమంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ ప్రశ్నించారు.