వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు

Votes of the elderly and disabled

May 25, 2024 - 12:33
 0
వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జౌన్‌పూర్‌లోని ధేరాపూర్ నివాసి 101కి చెందిన మోహిని మిశ్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కళ రామ మందిర నిర్మాణమన్నారు. నిర్మాణం పూర్తి కావడంతో తన జీవిత కల నెరవేరిందన్నారు. తన ఓటు హక్కును కూడా రాముడికే సమర్పించానని ఆమె పేర్కొనడం విశేషం. 

అంబేద్కర్​ నగర్​ లో దివ్యాంగుడు ఓటువేసేందుకు ఆగా పోలింగ్​ స్టేషన్​ సిబ్బంది అతన్ని పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆయనతో ఓటు వేయించారు. 

116 ఏళ్ల వృద్ధురాలు ఓటు..

అంబేద్కర్ నగర్‌లో 116 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసేందుకు క్యారేజ్‌లో వచ్చింది. పైకోలియా పోలింగ్ స్టేషన్‌లో ఆమె ఓటు వేశారు. ఉదయం కుటుంబ సభ్యులు ఆమెకు తిలకం దిద్దారు. అనంతరం ప్రత్యేక రథంపై ఊరేగింప చేస్తూ పోలింగ్​ స్టేషన్​ కు తీసుకువచ్చారు. అనంతరం ఆమె మహిళా పోలింగ్​ స్టేషన్​ లో ఓటు వేశారు.