పదవీ విరమణపై పరిశీలన లేదు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
Union Minister Jitendra Singh is not considering retirement
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం సవరించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. బుధవారం పార్లమెంట్ లో ప్రతిపాదనపై రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 60యేళ్లు నిండిన తరువాత పదవీ విరమణ పెంపు ప్రతిపాదనపై జవాబిచ్చారు. యువతకు సివిల్ సర్వీసెస్ లో ఉపాధి కల్పించే విధానాలు, చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను గడువులోగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చామని సింగ్ తెలిపారు.