శ్రీరామనవమికి ఘనంగా ఏర్పాట్లు

వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువే! నుదుటన సూర్యకిరణాలు ట్రయల్​ రన్​ పూర్తి ఎండకాలం నేపథ్యంలో జర్మన్​ కార్పెట్ల ఏర్పాట్లు వంద ఎల్​ ఈడీ  స్క్రీన్లు సిద్ధం తొలిసారి బాలరాముడి ఇంట్లో నవమి వేడుకలు

Apr 12, 2024 - 20:43
 0
శ్రీరామనవమికి ఘనంగా ఏర్పాట్లు

లక్నో: అయోధ్యలో శ్రీరామనవమి ఏప్రిల్​ 17న బాలరాముడి నుదుట సూర్యకిరణాలు పడే అద్భుత ఘట్టం చోటు చేసుకోనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ట్రయల్​ కూడా పూర్తి అయ్యింది. ఏప్రిల్​ 17న నవమి సందర్భంగా భగవంతుడి దర్శనంతో మానవాళికి సుఖశాంతుల జీవితం చేకూరనుంది. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య బాలరాముడి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలను చూసేందుకు ఇప్పటికే లక్షలాది మంది వీఐపీలు, వీవీఐపీలు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనీయాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. అయోధ్యతోపాటు నవమి ఉత్సవాలను 800 మఠాలు, దేవాలయాల్లో కూడా నిర్వహించనున్నారు. 

నవమి సందర్భంగా బాలరాముడి విగ్రహాం సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రత్యేకంగా వేలక్వింటాళ్ల పూలను తెప్పించారు. ప్రత్యేక దుస్తులను రూపొందించారు. వందకుపైగా ఎల్​ ఈడీ స్క్రీన్లను సిద్ధం చేయడం విశేషం. 

దర్శనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అధికారులు చేపట్టారు. ఎండలు కూడా మండిపోతుండడంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జర్మన్​ కు చెందిన కార్పెట్లను ఏర్పాటు చేయనున్నారు. 

అయోధ్యలో తొలిసారిగా శ్రీరామనవమి వేడుకల సందర్భంగా వీఐపీ, వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉండనుంది. ఐదువందల యేళ్లుగా నానుతున్న వివాదం కాస్త ప్రధాని మోదీ నేతృత్వంలో ఓ కొలిక్కి వచ్చి హిందువుల కల నెరవేరడంతో తొలి వేడుకలు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది.