ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం
గాలిలోనే ధ్వంసం చేశామన్న ఐడీఎఫ్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ లెబనాన్ నుంచి వందల సంఖ్యలో క్షిపణులతో దాడులు
జెరూసలెం: ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆదివారం లెబనాన్ సరిహద్దుల ద్వారా ఈ బాంబుదాడులకు పాల్పడుతోంది. కాగా ఈ దాడులను ముందే ఊహించిన ఇజ్రాయెల్ సరిహద్దుల వద్ద భారీగా ఐరన్ డ్రోమ్ లను మోహరించి దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాంబులను గాలిలోనే పేల్చేసినట్లుగా ఐడీఎఫ్ ప్రకటించింది.
వెంటనే లెబనాన్ నుంచి వదిలి వెళ్లాలని అమెరికా, బ్రిటన్ పౌరులను ఆ దేశాలు కోరాయి. మరోవైపు ఇజ్రాయెల్ కు మద్ధతుగా అమెరికా కూడా భారీ ఎత్తున సరిహద్దుల వద్ద యుద్ధ నౌకలు, విమానాలను మోహరించింది. కాగా ఇస్మాయిల్ హనియా హత్యలో ఏడు కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లుగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పై ఈ దాడులు యుద్ధానికి సంకేతంగా పలు దేశాలు భావిస్తున్నాయి.