ఫ్లై ఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకుల దుర్మరణం
Two youths died after falling from the flyover
నా తెలంగాణ, హైదరాబాద్: గచ్చిబౌలిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ నుంచి బైక్ పై అతి వేగంగా వెళుతూ అదుపు తప్పి కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మియాపూర్ లో నివాసం ఉంటున్న గుంటూరుకు చెందిన రోహిత్, బాలప్రసన్నలు ఉద్యోగ వేటలో ఉన్నారు. వీరిద్దరు ద్విచక్ర వాహనంపై హఫీజ్ పేట్ కు వెళుతూ కొత్త గూడ ఫ్లై ఓవర్ పై అతి వేగం వల్ల అదుపు తప్పారు. దీంతో వంతెనను ఢీ కొని కిందపడ్డారు. ఇద్దరినీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.