సోషల్ మీడియాతో పిల్లల్లో దుష్ప్రభావాలు
బిలియనీర్ ఎలన్ మస్క్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా బారి నుంచి పిల్లలను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. శుక్రవారం తన అభిప్రాయాలను పంచుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం యువకులపై కూడా తీవ్రంగానే ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండకపోతే పిల్లలకు ప్రమాదమన్నారు. ఎక్కువ కాలం, సమయం సోషల్ మీడియాను, సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం శ్రేయస్కరం కాదని మస్క్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీల ద్వారా కూడా తీవ్రమైన పోటీ నెలకొందన్నారు. ఇది కూడా పిల్లలను ప్రభావితం చేసే అవకాశం ఉందని మస్క్ తెలిపారు. పిల్లలపై ఫేస్ బుక్, ఇన్ఇన్స్టాగ్రామ్ ల లాంటివి కూడా ఆందోళనకు కారణమని తెలిపారు.