మోదీ ఆస్తులు రూ. 3.02 కోట్లు ఇల్లు, కారు, భూమి లేదు

వేతనం, బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీయే ఆదాయం నామినేషన్​ లో పేర్కొన్న ప్రధాని

May 14, 2024 - 18:54
 0
మోదీ ఆస్తులు రూ. 3.02 కోట్లు ఇల్లు, కారు, భూమి లేదు

వారణాసి: ప్రధానమంత్రి ఆస్తుల విలువ రూ. 3.02 కోట్లు, రూ. 52,920 నగదు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్​ (నామినేషన్​)​ లో పేర్కొన్నారు. మంగళవారం ప్రధాని మోదీ నామినేషన్​ వేశారు. నామినేషన్​ లో సమర్పించిన వివరాల మేరకు ఆయన ఆస్తులు ఐదేళ్లలో రూ. 87 లక్షలు పెరిగాయి. 

కాగా ప్రధానికి ఇల్లు, భూమి, కారు లాంటి స్థిర, చరాస్థులు లేవు. 15యేళ్లుగా ప్రధాని ఎలాంటి ఆభరణాలు కొనుగోలు చేయలేదు.

2014లో ప్రధాని మోదీ ఆస్తుల విలువ రూ. 1.05 కోట్లుండగా, 2019 నాటికి రూ. 2.15 కోట్లకు పెరిగింది. 2024లో రూ. 3.02 కోట్లకు పెరిగింది. మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు వాటి బరువు 45 గ్రాములుగా పేర్కొన్నారు. వీటి విలువ రూ. 2.67 లక్షలుగా తెలిపారు. 

ప్రధానికి షేర్లు, మ్యూచువల్​ ఫండ్లు లాంటి వాటిలో పెట్టుబడులు లేవు. పోస్టాఫీసులో రూ. 9.12 లక్షల ఎన్​ ఎస్​ సీ ఉంది. జీవిత బీమా కింద రూ. 1.90 లక్షలు పెట్టుబడి పెట్టారు. 

మోదీకి ప్రత్యామ్నాయ సంపదలు అంటూ ఏమీ లేవు. ప్రభుత్వం నుంచి నెలనెలా వచ్చే వేతనం, బ్యాంకుల ద్వారా వచ్చే వడ్డీనే ఆదాయంగా చూపించారు.