సెల్ఫీ మోజు.. లోయలోకి యువతి

Selfie craze.. young woman into the valley

Aug 4, 2024 - 20:13
 0
సెల్ఫీ మోజు.. లోయలోకి యువతి

పూణే: మహారాష్ట్రలో సెల్ఫీ తీసుకుంటూ ఓ యువతి వంద అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గార్డులు లోయలోకి దిగి అతి కష్టం మీద మహిళను తాళ్ల సాయంతో పైకి తీసుకువచ్చారు. ఆదివారం సతారాలోని బోర్న్​ ఘాట్​  సందర్శనకు పూణే నుంచి స్నేహితులతో కలిసి ఓ మహిళ వచ్చింది. ఆమె వయస్సు 29యేళ్లు. థోస్​ ఘర్​ జలపాతం వద్దకు వెళ్లి సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఇటీవలే భారీ వర్షాలు కురియడంతో ఆ ప్రాంతం బురద, నాచుపట్టి ఉండడంతో పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. వెంటనే ఘాట్​ కు చెందిన గార్డులు, స్థానికుల సహాయంతో ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. సెల్ఫీల మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని పోలీసులు, నిపుణులు ఎంత చెబుతున్నా పలువురు వినిపించుకోకపోవడంతో ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.