దేశ అస్థిరతకు రాహుల్​ కుట్ర

భగ్గుమన్న బీజేపీ ఎంపీ కంగనా రౌనత్​

Aug 12, 2024 - 13:06
 0
దేశ అస్థిరతకు రాహుల్​ కుట్ర

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాహుల్​ గాంధీ దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తున్నాడని బీజేపీ ఎంపీ కంగనా రౌనత్​ మండిపడ్డారు. సోమవారం ఆమె ట్వీట్టర్​ మాధ్యమంగా రాహుల్​ పై విమర్శలు చేశారు. హిండెన్​ బర్గ్​ ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే సెబీ స్పష్టం చేసిందన్నారు. అయినా రాహుల్​ గాంధీ విమర్శలు, ఆరోపణలు చూస్తుంటే దేశానికి ప్రమాదకమైన వారిగా మారాడని అన్నారు. 

రాహుల్​ విద్వేషపూరితంగా విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. దేశాన్ని నాశనం చేయాలన్న ఆయన ఆలోచన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 

ఇలాంటి తుచ్ఛ దేశ వ్యతిరేక ఆలోచనల వల్లే రాహుల్​ గాంధీ, ఆయన పార్టీ జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చొంటారని కంగనా రౌనౌత్​  ఎద్దేవా చేశారు.