లోకాయుక్త దాడులు రూ. 52 కేజీల బంగారం, రూ. 10 కోట్ల నగదు స్వాధీనం
Lokayukta raids Rs. 52 kg gold, Rs. 10 crore cash seized
మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ స్థావరాలపై సోదాలు
భోపాల్: మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ ఇంటిపై లోకాయుక్త దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 52 కిలోల బంగారం, రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్థరాత్రి లోకాయుక్త, పోలీసు అధికారులు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించి అధికారి అవినీతి బాగోతాన్ని గుట్టురట్టు చేశారు. తండ్రి మృతి చెందడంతో మాజీ ఆర్టీవో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ కారుణ్య నియామకం కింద విధులు చేపట్టాడు. 12యేళ్లు తర్వాత పదవి విరమణ పొందాడు. 12 యేళ్లలో భారీ అవినీతిని పోగేసినట్లు లోకాయుక్తకు ఉప్పందింది. దీంతో సౌరభ్, ఇతని స్నేహితుడు చందన్ సింగ్ గౌర్ లపై సంయుక్త దాడుల చేశారు. మెండోరి గ్రామ సమీపంలో ఓ కారులో 52 కేజీల బంగారం, రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సౌరభ్ పై అనేక అవినీతిని ఆరోపణలున్నాయి. ఇంట్లో రూ. 2.5 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రిటైర్మెంట్ తరువాత సౌరభ్ శర్మ రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ దాడులపై ఇంకా విచారణ కొనసాగుతుందని లోకాయుక్త ఏడీజీ జైదీప్ ప్రసాద్ ప్రకటించారు.