హిండెన్​ బర్గ్​ ది కుట్రే!

అసత్యాలకు గతంలోనే సమాధానం వ్యాపార వర్గాల్లో పరువు పోగొట్టుకున్నారు దేశ పురోగతిపై కాంగ్రెస్​ కుట్ర బీజేపీ నేత రవిశంకర్​ ప్రసాద్​

Aug 12, 2024 - 13:27
 0
హిండెన్​ బర్గ్​ ది కుట్రే!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హిండెన్​ బర్గ్​ నివేదిక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర దాగి ఉందని బీజేపీ నేత రవిశంకర్​ ప్రసాద్​ అన్నారు. సోమవారం ఆ సంస్థ నివేదికపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నివేదిపై అమెరికా బడా వ్యాపారులు, ప్రతిపక్షాలే మండిపడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు చతికిలపడ్డ కాంగ్రెస్​ ఇలాంటి సంస్థలతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తుందని మండిపడ్డారు.  

ఈ నివేదికపై సోమవారం మార్కెట్లను చూస్తే వీరి అసత్యాలకు జవాబు దొరుకుతుందని రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. హిండెన్​ బర్గ్​ వ్యాపార వర్గాలలో తన పరువు ప్రతిష్ఠలను పోగొట్టుకుందన్నారు. తొలిసారి కూడా ఇలాగే భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేయాలన్న ఉద్దేశ్యంతోనే హిండెన్​ బర్గ్​ నివేదిక బయటపెట్టిందన్నారు. కానీ సెబీ విచారణలో పూర్తిగా అవాస్తవాలను తేలిందని ఇందుకోసం సుప్రీంకోర్టు ఈ సంస్థకు నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. 

మరోవైపు హిండెన్​ బర్గ్​ పై కాంగ్రెస్​ ఎలా చూస్తుందో? దేశ ప్రజలకు అర్థం అవుతుందన్నారు. దేశంలో పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ పార్టీ ఉందన్నారు. ఇది దేశ పురోగతిపై కుట్ర పన్నుతోందన్నారు. దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను బలహీన పర్చే కుట్ర దాగి ఉందని రవిశంకర్​ ప్రసాద్​ కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీ ఆరోపణలపై మండిపడ్డారు.