అసత్యాలే రాహుల్​ ఏజెండా?

ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్​, కూటమి లక్ష్యం రాజ్యాంగాన్ని ఎన్డీయే గౌరవిస్తుంది రిజర్వేషన్లను రద్దు చేయబోం బీజేపీ ఎంపీ రవిశంకర్​ ప్రసాద్​

Apr 30, 2024 - 16:38
 0
అసత్యాలే రాహుల్​ ఏజెండా?

పాట్నా: రోజూ ఏదో ఒక అసత్యాలు చెబుతూ రాహుల్​ గాంధీ ప్రజల్లో తిరిగి ఇమేజ్​ ను రాబట్టుకోవాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్​ ప్రసాద్​ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు రాహుల్​ గాంధీ ఎవరని ప్రశ్నించారు. అసత్య ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
అవినీతి కేసుల్లో కాంగ్రెస్​ పార్టీ, కూటమి పార్టీలపై ప్రభుత్వ సంస్థలు దాడులు జరిపారని, కొందరు నాయకులు కూడా ఇప్పటికే జైలు జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని అసత్య ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని అన్నారు. ట్రిపుల్​ తలాక్​, దళిత వర్గానికి చెందిన రాంనాథ్​ కోవింద్​, గిరిజన మహిళ ద్రౌపది ముర్మూలను రాష్ర్టపతిని చేశామన్నారు. కానీ కాంగ్రెస్​ దాని మిత్రపక్షాలు వారిని రాష్ర్టపతులు కానీయకుండా ఎన్ని కుయుక్తులు పన్నాయో ప్రజలు చూశారని పేర్కొన్నారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్లను ఎన్నటికీ రద్దు చేయబోదని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు.