విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఉత్తదే అని తేల్చిన భద్రతా బలగాలు

Security forces have decided that bomb threats to airports are fine

Apr 30, 2024 - 16:09
 0
విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఉత్తదే అని తేల్చిన భద్రతా బలగాలు

నాగ్​ పూర్​: నాగ్​ పూర్, జైపూర్​, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్​ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్​ ను మంగళవారం టెర్రరిస్ట్​ 111 గ్రూప్​ పేరిట పంపినట్లు గుర్తించారు. బెదిరింపుపై ముందుజాగ్రత్త చర్యలను సీఐఎస్​ ఎఫ్​ చేపట్టింది.ఆయా ఏయిర్​ పోర్టులలో అనువణువు తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఏయిర్​ పోర్ట్​ ఉన్నతాధికారులు, భద్రతను అప్రమత్తం చేశారు. అయితే ఈ బెదిరింపులపై సైబర్​ క్రైమ్​ పోలీసులు, ఇంటలిజెన్స్​ వర్గాలు దృష్టి సారించాయి. బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బెదిరింపుల నేపథ్యంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో సోదాలు నిర్వహించారు. ఆయా సోదాల్లో ఏమీ లభించకపోవడంతో ఇది ఉత్తుత్తి బెదిరింపు మెయిల్​ గా భావిస్తున్నారు.