లడఖ్​ నుంచి ఇరుదేశాల సైన్యాలు పీఛేముడ్​

From Ladakh, the armies of both the countries are aboutturn

Oct 25, 2024 - 13:52
 0
లడఖ్​ నుంచి ఇరుదేశాల సైన్యాలు పీఛేముడ్​

గూడారాల తొలగింపు ప్రక్రియ షురూ
10 రోజుల తరువాత పెట్రోలింగ్​ 
భారత్​–చైనా ఒప్పందంతో శాంతికి మార్గం సుగమం

శ్రీనగర్​: భారత్​–చైనాల మధ్య ఒప్పందంతో ఎట్టకేలకు లడఖ్​ సరిహద్దు నుంచి చైనా, భారత బలగాలు వెనక్కు మళ్లాయి. సరిహద్దు వెంట చైనా సైన్యం వేసుకున్న గూడారాలను శుక్రవారం తొలగింపు ప్రక్రియ చేపట్టారు. డెమ్​ చోక్​, దేప్సాంగ్​ పాయింట్​ లలో ఉన్న గూడారాలను ఇరుదేశాల సైన్యాలు తొలగిస్తున్నాయి. వాహనాలు, సైనిక సామాగ్రిని కూడా వెనక్కి తీసుకుంటున్నాయి. దీంతో లడఖ్​ ఉద్రిక్తతకు ఫుల్​ స్టాప్​ పడినట్లయ్యింది. అదే సమయంలో సరిహద్దు ప్రాంతంలో పహారా మాత్రం కాస్తారు. అది కూడా ఇరుదేశాల సైనికాధికారులు ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో సరిహద్దు పహారా (పెట్రోలింగ్​) కాయనున్నారు. పది రోజుల తరువాత సరిహద్దుపెట్రోలింగ్​ ప్రారంభం కానుంది.  గతంలోని శాంతియుత పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇరుదేశాల విదేశాంగ శాఖలు, ప్రధానిమోదీ, చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​ చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి. దీంతో ఉద్రిక్తతలు తెరదించినట్లయ్యింది.