ప్రజావాణి యథాతథం కలెక్టర్ రాహుల్ రాజ్
Rahul Raj is the Collector of Public Radio
నా తెలంగాణ, మెదక్: ప్రజావాణిలో దరఖాస్తులను సోమవారం యథావిధిగానే సమర్పించవచ్చని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.