అతిథి అధ్యాపకుల రెన్యూవల్
1654 మందికి లబ్ధి నా తెలంగాణ ఎఫెక్ట్..
నా తెలంగాణ, సంగారెడ్డి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహించే అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గెస్ట్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘నా తెలంగాణ పత్రిక’ ఈ నెల 29న‘అతిథులకు అన్యాయం!’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనంలో అతిథి అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నా తెలంగాణ కళ్ళకు కట్టినట్టు ప్రచురించడంతో సర్కారు కదిలి వచ్చింది. అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్ర వ్యాప్తంగా 1654 మందికి లబ్ధి చేకూరినట్టయింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేసిన ‘నా తెలంగాణ పత్రిక’ యాజమాన్యానికి అతిథి అధ్యాపకులు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, జిల్లా అధ్యక్షుడు సాయిబాబా అతిథి అధ్యాపకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.