- జమ్మూకశ్మీర్ లో షా గర్జన
- హస్తం–ఎన్సీపీలది ద్వంద్వ నీతి
- మేనిఫెస్టోలో విధానమేంటో ప్రజలకు చెప్పాలి
- ఉగ్రవాదానికి ఆజ్యం పోసేలా విధానాలు
- 370 రద్దుతో బీజేపీ విజయం ఖాయమే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఎన్నికల సభలో అమిత్ షా గర్జించారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. సరిహద్దులో శాంతి కుదరనంత వరకూ పాక్ తో చర్చల ప్రస్తావనే ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఎన్సీపీ–కాంగ్రెస్ లది అనైతిక బంధమన్నారు. ఆ రెండు పార్టీ విభిన్న ధృవాలన్నారు. ఇరువురు విభిన్నంగా వాగ్ధానాలు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. ముందుగా ఇరుపార్టీల మేనిఫెస్టో ఒక్కటా, రెండా ప్రజలకు స్పష్టతనీయాల్సిన అవసరం ఉందన్నారు. మేనిఫెస్టోలో పాత విధానాన్ని పునరుద్ధరించదలిచారా? అని ప్రశ్నించారు. పాక్ తో చర్చలు జరుపుతారా? మేనిఫెస్టోలో స్పష్టం చేయాలన్నారు. విభజన విధానాలను ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీది మాత్రం ఒక్కటే విధానమని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని విడనాడే వరకు పాక్ తో ఎలాంటి చర్యలు జరపబోమని స్పష్టం చేశారు.
గుజ్జర్లు, బకర్వాల్ లు, పహారీలు, దళితుల రిజర్వేషన్లను రద్దు చేయాలనే యోచనతో కాంగ్రెస్, ఎన్సీలున్నాయని షా మండిపడ్డారు. పాక్ తో వాణిజ్యంపై చర్చలు ప్రారంభించాలని ఉవ్విళూరుతున్నాయని ఈ పార్టీలు తీసుకున్న నిర్ణయాల వల్ల జమ్మూకశ్మీర్ శాంతికి విఘాతం కలుగుతుందని ఆరోపించారు. వీరి చర్యలు ఉగ్రవాదానికి ఆజ్యం పోసేవిలా న్నాయని మండిపడ్డారు.
బీజేపీది ఆది నుంచి ఉగ్రవాదంపై ఒక్కటే విధానమన్నారు. అది ఏ రూపంలో ఉన్నా శాంతికి విఘాతమేనన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా నిర్మూలించడంలో తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అమిత్ షా స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ లో బీజేపీ బలమెంత?..
2008 ఎన్నికల్లో ఎన్సీకి 28, కాంగ్రెస్ కు 17, పీడీపీకి 21, బీజేపీకి 11, ఇతరులకు 10 స్థానాలు దక్కాయి. బీజేపీకి ఓటు బ్యాంకు షేర్ కేవలం 13 శాతం మాత్రమే ఉండగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు షేర్ 18 శాతంగా ఉంది. అదే 2014 ఎన్నికల్లో పీడీపీకి 28, ఎన్సీకి 15, బీజేపీకి 25, కాంగ్రెస్ కు 12, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. ఏకంగా 14 అత్యధిక సీట్లను కైవసం చేసుకొని 2008 ఎన్నికల కంటే 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం 23గా పెంచుకోగలిగింది. పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలతో మరింతగా ఓటుబ్యాంకు షేర్ ను ఇక్కడ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈసారి జమ్మూకశ్మీర్ లో బీజేపీ పూర్తి మెజార్టీ స్థానాల దిశగా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనించిన కాంగ్రెస్–ఎన్సీపీలు ఒకరినొకరు చేయి పట్టుకొని నడవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఏది ఏమైనా జమ్మూకశ్మీర్ లో ఒకప్పుడు రాళ్ల దిశగా సాగిన ప్రజాస్వామ్యంలో కాస్త పూర్తి మార్పు చోటు చేసుకొని ప్రస్తుతం మోదీ హయాంలో అభివృద్ధి, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి దిశగా సాగుతుండడం విశేషం.