నాణ్యమైన విద్యనందిచాలి
కలెక్టర్ రాహుల్ రాజ్
నా తెలంగాణ, మెదక్: విద్యార్థులను నాణ్యమైన విద్యనందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం శంకరంపేట ఆర్ మండలంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పరిసరాల పరిశుభ్రత, వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు కార్పొరేట్ తరహాలో విద్యార్థులకు బోధించాలన్నారు. అదే సమయంలో నాణ్యమైన ఆహారం, మౌలిక సదుపాయాల కల్పనలపై దృష్టి పెట్టాలన్నారు. అనంతరం పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు గణితం, ఆంగ్లం సబ్జెక్ట్ లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరుపై ఆరా తీశారు. అనంతరం ఫ్రైడే డ్రై డేలో భాగంగా సమీప గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు. వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీ ఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.