ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
Navratri celebrations are grand
నా తెలంగాణ, మెదక్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మెదక్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా లంబోదరుడి నామస్మరణ, భాజాలు, భజంత్రీలు, డప్పుచప్పుళ్లు, సౌండ్ బాక్సులతో విఘ్నేశ్వరుడి కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. పట్టణంలోని రాందాస్ చౌరస్తా ఆటోనగర్ అజంపుర న్యూ మార్కెట్ చమన్ వీర హనుమాన్ కాలనీలో గణనాథునికి స్థానికులు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయక వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళలు లలిత నామ సహస్రనామ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏది ఏమైనా ప్రతీయేటా వచ్చే వినాయక చతుర్థి ఉత్సవాలను మెదక్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ 11 రోజులు ఇదే వాతావరణం కొనసాగనుంది.