రాయ్​ బరేలీకే రాహుల్​ ఫిక్స్​

వయోనాడ్​ లో ప్రియాంక వాద్రా పోటీ కాంగ్రెస్​ సమావేశంలో నిర్ణయం

Jun 17, 2024 - 21:03
 0
రాయ్​ బరేలీకే రాహుల్​ ఫిక్స్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్​ గాంధీ రాయ్​ బరేలీలో ఫిక్స్​ అయ్యారు. వయోనాడ్​ ను వదులుకున్నారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్​ పార్టీ నేతృత్వంలో న్యూ ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సీనియర్​ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్​ గాంధీ రాయ్​ బరేలీ నుంచే ఎంపీగా కొనసాగనున్నట్లు నిర్ణయం తీసుకున్నానని  మీడియాతో వెల్లడించారు. వయోనాడ్​ ప్రజలకు ఇచ్చిన పూర్తి హామీలను నెరవేరుస్తానని రాహుల్​ గాంధీ తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరవీడినట్లయ్యింది. అయితే వయోనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ ఎంపీగా పోటీ చేయనున్నారని వెల్లడించారు. తాను కూడా వయోనాడ్​ ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ముందుంటానని రాహుల్​ గాంధీ తెలిపారు. అనంతరం ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. వయోనాడ్​ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.