కేంద్రమంత్రి యూట్యూబ్​ కు గోల్డెన్​ బటన్​!

Golden button for Union Minister's YouTube!

Nov 6, 2024 - 18:29
 0
కేంద్రమంత్రి యూట్యూబ్​ కు గోల్డెన్​ బటన్​!

ముంబాయి: సోషల్​ మీడియా, యూట్యూబ్​ 2021 నుంచి యాక్టివ్​ గా ఉంటున్న కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీకి యూట్యూబ్​ గోల్డెన్​ బటన్​ అందించింది. బుధవారం ఆయన కార్యాలయంలో యూట్యూబ్​ నిర్వాహకులు ఈ గౌరవాన్ని మెమెంటో రూపంలో మంత్రికి అందజేశారు. యూట్యూబ్​ లో మంత్రికి 10 లక్షల మంది చందాదారుల (సబ్​ స్ర్కైబర్ల)ను దాటారు. ఈ ఛానల్​ లో ఇప్పటివరకు 4200 వీడియోలను మంత్రి గడ్కరీ పోస్టు చేశారు. 1, 34, 230 మంది ఈ ఛానల్​ కు వీక్షకులుండగా, ఛానల్​ ను 22,54,32,434 మంది వీక్షించారు.