డార్జిలింగ్​ రైలు ప్రమాదం 9మంది మృతి 41మందికి గాయాలు

సిగ్నలింగ్​ లోపమా? డ్రైవర్​ తప్పిదమా? విచారణ అనంతరమే వెల్లడిస్తామన్న అధికారులు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

Jun 17, 2024 - 21:22
 0
డార్జిలింగ్​ రైలు ప్రమాదం 9మంది మృతి 41మందికి గాయాలు

కోల్​ కతా: డార్జిలింగ్​ రైలు ప్రమాదంలో మొత్తం 9మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 41 మందికి గాయాలైనట్లు తెలిపాయి. డార్జిలింగ్​ లో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ఉదయం 8:27 గంటలకు రంగపాణి స్టేషన్ నుంచి బయలుదేరింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా రాణిపాత్ర రైల్వే స్టేషన్, ఛతర్ హాట్ మధ్య నిలిపివేశారు. అదే సమయంలో రంగపాణి నుంచి వస్తోన్న గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో ఎక్స్​ ప్రెస్​ రైలులోని మూడు బోగీలు ఒకదానిపై మరొకటి పడ్డాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్ సహా 8 మంది మరణించారని నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేను ఉటంకిస్తూ తూర్పు రైల్వే సీపీఆర్వో కౌశిక్ మిత్రా తెలిపారు.
రైల్వే సిగ్నలింగ్​ లో లోపమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. తొలుత గూడ్స్​ డ్రైవర్​ దే తప్పిదమని భావించినప్పటికీ పూర్​ సిగ్నలింగ్​ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరమే చెప్పగలమన్నారు. కాగా కవచ్​ సిస్టమ్​ ఈ ట్రాక్​ పై యాక్టివ్​ గా లేదని రైల్వే బోర్డు చైర్​ పర్సన్​ జయవర్మ సిన్హా తెలిపారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున సహాయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీంతో పాటు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున సాయం ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ సంఘటనా స్థలానికి బయలుదేరారు. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో బైక్​ పైనే ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం కారణంగా 19 రైళ్లను దారి మళ్లించారు.