ప్రధాని మోదీకి పాక్​ ఆహ్వానం

ఎస్​ సీవో సదస్సుకు హాజరు కావాలని పిలుపు

Aug 29, 2024 - 18:05
 0
ప్రధాని మోదీకి పాక్​ ఆహ్వానం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్​ వెళ్లనున్నారా?! భారత్​ తో పాక్​ సత్సంబంధాలకు ఉవ్విళూరుతోంది. ఈ నేపథ్యంలో పాక్​ లో అక్టోబర్​ నెలలో జరిగే షాంఘై కో ఆపరేషన్​ ఆర్గనైజేషన్​ (ఎస్​ సీవో) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు గురువారం అధికార వర్గాలు వెల్లడించారు. 
 
మరోవైపు పాక్​ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని, ఆ దారిని విడనాడితే గాని ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు సాధ్యపడవని అనేకమార్లు భారత్​ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్​ ఆహ్వానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్​ 15–16 తేదీల్లో ఈ శిఖరాగ్ర సమావేశం పాక్​ లో జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్​ మోదీని ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. అయితే ఈ సమావేశంలో భారత్​ తరఫున ఎవరు హాజరవుతారనే నిర్ణయాన్ని భారత్​ స్పష్టం చేయలేదు. 
 
భారత్​, చైనా, రష్​యా, పాక్​, కజకిస్తాన్​, కిర్గిస్థాన్​, తజికిస్థాన్​, ఉజ్భెకిస్తాన్​ లు ఎస్​ సీవోలో భాగస్వామ్య దేశాలు. ఆర్థికం, సామాజిక–సాంస్కృతిక, మానవతా సహకారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.