హస్తంకు మరో ఝలక్ పార్టీని వీడిన రాధిక ఖేడా
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రామ మందిరంపై కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా
రాయ్ పూర్: కాంగ్రెస్ పార్టీని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఆదివారం ఆ పార్టీకి చెందిన మరో నాయకురాలు పార్టీని వీడింది. అయితే ఈమె ఏప్రిల్ 30నే ట్వీట్ చేస్తూ పార్టీని వీడానని చెప్పినా ఆ ట్వీట్ కాస్త ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఐఐటీ అహ్మదాబాద్‌కు చెందిన రాధిక ఖేడా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్‌లో మీడియా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయోధ్య బాలరాముని దర్శనాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతోనే తాను మనస్థాపం చెంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
పార్టీలో ఉండి అందరికీ సహాయం చేసే న్యాయం చేసే తనకే న్యాయం దక్కలేదని ఆరోపించారు. తన వాదనలే పార్టీ వినలేదని అన్నారు. దేశ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు.
శ్రీరాముడి జన్మస్థలం పవిత్రత, ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. అలాంటి రాముడినే చూసేందుకు పార్టీ అనుమతి తీసుకోవాల్సి రావడం విడ్డూరకరమన్నారు.