బిహార్లో రిజర్వేషన్లు రద్దు
పాట్నా హైకోర్టు తీర్పు పాతపద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు
పాట్నా: బిహార్ లో 65 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పాట్నా హైకోర్టు ప్రకటించింది. గురువారం రిజర్వేషన్ల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలు, బీసీలకు రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే 50 శాతం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 65 శాతం రిజర్వేషన్లపై గౌరవ్ కుమార్, ఇతరులు పాట్నాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుధీర్ఘ విచారణ కొనసాగించిన చీఫ్ జస్టిస్ కేవీ చంద్రన్ బెంచ్ 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
రిజర్వేషన్లను పెంచుతూ బిహార్ ప్రభుత్వం 2023లో గెజిట్ ను విడుదల చేసింది. 65 శాతంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లతో కలుపుకుంటే మొత్తం 75 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావించింది.