చాయ్​ వాలా చరిత్రను తిరగరాశాడు

నిరుపేదలు కూడా సీఎం, పీఎంలు కావొచ్చు కుటుంబతత్వ రాజకీయాలకు తిలోదకాలు దేశ భవిష్యత్​ కు పునాదులు ములాయంసింగ్​ ఆశీర్వాదం తమకు బలం నిరుపేదల సంక్షేమమే మోదీ లక్ష్యం ఇటావా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 5, 2024 - 17:03
May 5, 2024 - 20:09
 0
చాయ్​ వాలా చరిత్రను తిరగరాశాడు

లక్నో: నిరుపేదల పిల్లలు కూడా సీఎం, పీఎంలు అయ్యే సంస్కృతిని మోదీ వికసింప చేశాడని చాయ్​ వాలా ప్రధాని అయ్యాడని నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ తత్వ పార్టీల వారే రాజకీయ పీఠాలను అధిరోహించే చరిత్రను చాయ్​ వాలా తిరగరాశాడని పేర్కొన్నారు. భవిష్యత్​ లో రాజకీయ క్షేత్రంలో నిరుపేదల పిల్లలు కూడా రాణిస్తారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను దేశ భవిష్యత్​ కోసం పునాదులు వేస్తున్నానన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరి భవిష్యత్​ కోసమే పాటు పడుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ములాయంసింగ్​ సేవలను కొనియాడారు. ప్రస్తుతం ఆయన సోదరుడు కూడా తమ వెంట నడుస్తూ ఆశీర్వదించడం తమకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుందని తెలిపారు. మోదీ అధికారం పేరుతో ఎప్పుడు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. నిరుపేదలు, దళితులు, ఆదివాసీల పక్షాన నిలుస్తూ వారి సంక్షేమం కోసమే పాటుపడుతున్నాడని పునరుద్ఘాటించారు.

ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఇటావాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 12 రాష్ర్టాల్లో జరగనున్న 93 స్థానాలకు గాను మే 7న జరగనున్నాయి. 

ఎస్పీ-కాంగ్రెస్‌ చేస్తున్న వాగ్ధానాల్లో నిజాలు లేవన్నారు. వారు రాజకీయ లబ్ధికోసమే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను తాము తీసుకుంటే, వ్యాక్సిన్​ లపై లేని పోని అపోహలు, భయబ్రాంతులను ఈ నాయకులు సృష్టించారని ఆరోపించారు. వీరు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా వ్యాక్సిన్​ లు వేసుకున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. వారి కుటుంబాలు మాత్రం క్షేమం ఉండాలని వ్యాక్సిన్​ లు తీసుకునే వారని అన్నారు. 

రిజర్వేషన్లు లాంటి విషయాలపై కూడా ద్వంద విధానాలు, అసత్య వార్తలు ప్రచారం చేస్తూ వారి పరువు వారే బజారులో పెట్టుకున్నారని ప్రధాని మండిపడ్డారు. 

ప్రతీ ఒక్కరికి సొంతిళ్లు ఉండాలనేది తన కల అని మోదీ తెలిపారు. నిరుపేదలు కూడా గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించాలనేదే తన ఆకాంక్ష అన్నారు. అందుకే నీరు, విద్యుత్​, విద్య, వైద్యం, గ్యాస్​, ఉచిత రేషన్​ లాంటి అనేక సంక్షేమ పథకాలను వారి గడప వరకు చేర్చే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు. అందులో సఫలమయ్యామని అన్నారు. 

కాంగ్రెస్​, ఎస్పీ పార్టీలు మెయిన్​ పురి, కన్నౌజ్​, ఇటావాలను తమ జాగీర్లుగా భావిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేక చేతులెత్తిసిన వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. 

మోదీ ఉన్నా లేకపోయినా నిరుపేదల సంక్షేమం కోసం మరో వెయ్యి సంవత్సరాల వరకు బలమైన పునాదిని వేస్తున్నాడని ప్రజలు గుర్తించాలని తెలిపారు. తనకు కుటుంబం లేదని అందుకే 140 కోట్ల మందినే తన కుటుంబీకులుగా భావిస్తున్నానని మోదీ స్పష్టం చేశారు.