పాక్ లో పెరిగిన గాడిదలు!
Donkeys increased in Pakistan!
ఇస్లామాబాద్: పాక్ లో గాడిదల సంఖ్య పెరిగింది. గాడిదల సంఖ్య పెరగడంపై ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి మొహ్మద్ ఔరంగజేబ్ బుధవారం ప్రకటించారు. 2023–24 పశువుల డేటాపై నిర్వహించిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం ప్రతీయేటా 10వేల గాడిదల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుతం గాడిదల సంఖ్య 59 లక్షలున్నట్లుగా తెలిపారు. గొర్రెలు, మేకల సంఖ్యలో కూడా పెరుగుదల చోటు చేసుకుంటుందని వివరించారు. పాక్ గ్రామీణ ప్రాంతాల్లో 80 లక్షలకు పైగా కుటుంబాలు పశువుల ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పాక్ లో మొత్తం పశువుల సంఖ్య 5.75 కోట్లు, గొర్రెల సంఖ్య 3.27 కోట్లు, మేకల సంఖ్య 8.7 కోట్లకు, గేదెల జనాభా 4.6 కోట్లకు పెరిగిందన్నారు. దీని ద్వారా 35 నుంచి 40 శాతం కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని మంత్రి ఔరంగజేబ్ తెలిపారు. పాక్ ఆర్థిక స్థితుల నుంచి గట్టెక్కడం లేదు. మంత్రి ప్రకటన గాడిదల సంఖ్యలో పెరుగుదలతోనైనా పాక్ ఆర్థిక పరిస్థితిలో మార్పులు రావచ్చేమో.