నాగ్ పూర్ లో భూకంపం 2.7గా తీవ్రత నమోదు
భూకంప కేంద్రం ఉమ్రేద్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు
ముంబై: మహారాష్ర్టలోని నాగ్ పూర్ లో స్వల్పభూకంపం సంభవించింది. ఆదివారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై తీవ్రత 2.7గా నమోదైంది. భూకంప కేంద్రం ఉమ్రేద్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే 3న కూడా నాగ్ పూర్ లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. వీటి తీవ్రత 2.5గా నమోదైనట్లు వివరించారు. ఇటీవలి కాలంలో మార్చి 21న హింగోలిలో 4.5, 4.2 తీవ్రతతో భూకంపాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.