ఋణమాఫీ వైఫల్యాలపై రచ్చబండ

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి

Aug 20, 2024 - 17:31
Aug 20, 2024 - 17:32
 0
ఋణమాఫీ వైఫల్యాలపై రచ్చబండ

నా తెలంగాణ, నిర్మల్: రైతుల ఋణాలను మాఫీ కుమార్ అయిందని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కూనింటి అంజు రెడ్డి ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. రచ్చబండను విజయవంతం చేయడానికి. నిర్మల్ జిల్లా నుండి భారతీయ జనతా పార్టీ బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో అంజు కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో పూర్తిగా విఫలమైంది. రైతులను మోసం చేసిందని. రైతన్నలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని రైతులకు పూర్తిగా ఋణమాఫీ అయ్యేంతవరకు రైతులు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఋణమాఫీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రచ్చబండ కార్యక్రమం కొనసాగించాలన్నారు. దీని ద్వారా రైతుల సమస్యలను గుర్తించి గవర్నర్ కు వివరిస్తామని అన్నారు. కార్యకర్తలందరూ స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని. 

ఈ కార్యక్రమాలను ఐదు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయడానికి. అలాగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా పార్టీ సభ్యత్వం నమోదు చేసి సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రస్థాయిలోనే మొదటి జిల్లాగా తీసుకురావాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అలివేలుమంగ, జిల్లా కార్యదర్శి శ్రావణ్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఒడిసిల అర్జున్, స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్ కుమ్మరి వెంకటేష్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి గడిచింది.