ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు
A rich fennel flower bathukamma sambura
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో మహిళలు బుధవారం ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించే పువ్వులు తంగేడు, గునుగు మొదలైన తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. రామకృష్ణాపూర్ లో ఆయా కాలనీల్లోని కూడళ్లలో పెద్ద ఎత్తున అలంకరణలతో, ఆటపాటలతో బతుకమ్మను ఆడారు. అనంతరం స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ బతుకమ్మ వేడుకల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలంతా పాల్గొన్నారు.