మంత్రి సీతక్క రాజీనామా చేయాలి
బీజేపీ రావుల రాం నాథ్
నా తెలంగాణ, నిర్మల్: పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్చార్జి, రాష్ట్రమంత్రి దనసరి సీతక్క రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాం నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రజలను భయపెట్టి ఓట్లు పొందారని కాంగ్రెస్ నేతలు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే మతకలహాలు వస్తాయని పనికి ఆహార పథకం ఎత్తి వేస్తారని స్వయంగా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దుష్ప్రచారం చేశారన్నారు. అలాగే పింఛన్లు రావని, బీడీ పరిశ్రమను మూత పడుతుందని ప్రచారం చేశారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుమ్మక్కై బీజేపీని ఓడించటానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయని పేర్కొన్నారు. వారు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారని తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధి బీజేపీకి కంచుకోట అని గుర్తు పెట్టుకోవాలని రావుల రాంనాథ్ అన్నారు.