ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

కాంట్రాక్టర్​ గాదె వినయ్​ రెడ్డి

Jun 15, 2024 - 15:20
 0
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

నా తెలంగాణ, డోర్నకల్​: బడీఈడు పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాలని ఇక్కడే నాణ్యమైన విద్య అందుతుందని కాంట్రాక్టర్​ గాదె వినయ్​ రెడ్డి అన్నారు. శనివారం వినయ్​ తొర్రూర్​ మండలంలోని కామనపల్లి తండా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, వాటర్​ బాటిల్లు, యూనిఫార్స్మ్​ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులను పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రస్తుతం ప్రైవేటుకు ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతోందన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్​ బాగుంటుందని తెలిపారు. నాణ్యమైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులు ఎంతో చొరవ చూపుతున్నారని అన్నారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపుతూ వారి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వినయ్​ రెడ్డిని ఘనంగా సన్మానించారు.