29,30న క్వాడ్​ సమావేశం

టోక్యో చేరుకున్న మంత్రి జై శంకర్​

Jul 28, 2024 - 14:43
 0
29,30న క్వాడ్​ సమావేశం

టోక్యో: క్వాడ్​ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్-QSD) జపాన్​ లో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జైశంకర్​ ఆదివారం జపాన్​ లోని టోక్యోకు చేరుకున్నారు. ఆయనకు భారత రాయబారి సిబి జార్జ్ స్వాగతం పలికారు. 

క్వాడ్​ (ఆస్ట్రేలియా, భారత్​, జపాన్, యూఎస్​) దౌత్య భాగస్వామ్య దేశాల సమూహం. రెండురోజులు జూలై 29, 30న ఈ సమావేశం నిర్వహించనున్నారు. 
నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు క్వాడ్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లనున్నారు. దౌత్య భాగస్వామ్యంలో రక్షణ, భద్రత, స్థిరమైన అభివృద్ధిపై నాలుగుదేశాలతో చర్చించనున్నారు. ఆదివారం రాత్రికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింక్లెన్​ తో జై శంకర్​ భేటీ కానున్నారు. ఈ సమావేశం జనవరిలోనే జరగాల్సి ఉండగా వాయిదా పడింది.