ఆరోపణలపై సవాల్ మీడియా ముఖంగా ఇద్దరం కూర్చుందామా
ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
అమేథీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కాంగ్రెస చేస్తున్న ఆరోపణలపై మీడియా వేదికగా ఇద్దరం కూర్చుందామని సవాల్ విసిరారు. వారు చేస్తున్న అన్ని ఆరోపణలకు సమాధానాలున్నాయన్నారు. అదే తమ ప్రశ్నలకు వారి వద్ద ఒక్కదానికి కూడా జవాబు లేదన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏం అంశంపైనైనా తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు.
వీరి ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు మ పార్టీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది సరిపోతారని అన్నారు.
గాంధీ కుటుంబానికి అమేథీ కంచుకోటగా ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి ఆ రివాజును స్మృతి ఇరానీ మార్చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి చేతిలో ఘోర ఓటమిపాలయ్యారు. మరోమారు ఓటమి భయంతోనే గాంధీ కుటుంబం రాయ్ బరేలీకి పారిపోయిందని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను అమేథీ నుంచి రంగంలోకి దింపారు.
కాగా రాయ్ బరేలీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన దినేష్ ప్రతాప్ సింగ్ నే మరో మారు బీజేపీ రంగంలోకి దింపడం విశేషం. ఈసారి ఎలాగైనా ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలనే పట్టుదలతో పనిచేస్తుంది. ఏది ఏమైనా స్మృతి ఇరానీ, ప్రియాంక గాంధీ సవాళ్లు, ప్రతిసవాళ్లు చర్చనీయాంశంగా మారాయి.