‘తరంగ్​ శక్తి’కి ఆస్ట్రేలియా యుద్ధ విమానాలు

Australian fighter jets for 'Tarang Shakti'

Sep 3, 2024 - 13:20
 0
‘తరంగ్​ శక్తి’కి ఆస్ట్రేలియా యుద్ధ విమానాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ పలు దేశాలతో కలిసి నిర్వహిస్తున్న వైమానిక దళం విన్యాసాలు ‘తరంగ్​ శక్తి’లో ఆస్ట్రేలియా తమ యుద్ధ విమానాలను మంగళవారం భారత్​ కు పంపింది. ఈ విన్యాసాలు ఆగస్ట్​ 30 నుంచి ప్రారంభం కాగా సెప్టెంబర్​ 13 వరకు జోధ్​ పూర్​ లో కొనసాగనున్నాయి. యుద్ధ విమానాలు పంపినట్లు ఆస్ట్రేలియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తరంగ్​ శక్తిలో ఆస్ట్రేలియాతోపాటు గ్రీస్​, శ్రీలంక, యూఏఈ, జపాన్​, సింగపూర్​, అమెరికా దేశాలు పాలుపంచుకుంటున్నాయి. ఆస్ట్రేలియా పంపిన ఈఏ–18జీ గ్రోలర్​ విమానాలతోపాటు 120 మంది సిబ్బంది ఉన్నారు. తరంగ్​ శక్తిలో భాగస్వామ్య భద్రత సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకునేందుకు, ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు దోహదపడనున్నాయి. "భారతదేశం ఆస్ట్రేలియాకు అత్యున్నత స్థాయి భద్రతా భాగస్వామి  అని ఆదేశ ఎయిర్ మార్షల్ చాపెల్ అన్నారు.2018, 2022,2024 మొదట్లో కూడా ఇలాంటి వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నామని తెలిపారు.