బోనాల పండుగ శుభాకాంక్షలు
అమ్మవారి ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి దంపతులు
నా తెలంగాణ, హైదరాబాద్: బోనాల పండగ పురస్కరించుకుని ఇవాళ అంబర్ పేట్ అసెంబ్లీ నియోజక వర్గంలోని వివిధ ఆలయాలను సందర్శించాను. దేశంలో, రాష్ర్టంలో ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. అమ్మవారి దయ, చల్లని చూపు, కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలన్నారు. హైదరాబాద్ బోనాల పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ బోనాల పండుగ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి కావ్య కిషన్ రెడ్డి కాచిగూడ లోని నింబోలి అడ్డ మహంకాళి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. పూజాధికాలు సమర్పించి కేంద్రమంత్రి దంపతులు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆలయంలతోపాటు నగరంలోని మరికొన్ని ఆలయాలను కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.