సమావేశాలకు కాంగ్రెస్ అడ్డంకులు
Congress obstacles to meetings
కొనసాగుతున్న వాయిదాల పర్వం
కాంగ్రెస్, రాహుల్, ఖర్గే తీరుపట్ల బీజేపీ ఎంపీల ఆగ్రహం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: శీతాకాల, 2024 సంవత్సరం ఆఖరి పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగే సూచనలు దూర దూరం వరకూ కనిపించడం లేదు. అదిగో పాము అంటే ఇదిగో కర్ర అన్న తీరులో కాంగ్రెస్, కూటమి పక్షాల వ్యవహార శైలితో వరుసగా సమావేశాలు వాయిదా పడుతున్నాయి. గురువారం కూడా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు పునరావృతం కావడంతో మధ్యాహ్నం వరకూ వాయిదా పడ్డాయి. జ్యోతిరాధిత్య సింధియాపై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు, అదానీ, సంభాల్, మణిపూర్, జార్జ్ సోరోస్, రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల్లో మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.
కేంద్రమంత్రి జేపీ నడ్డా: రాజ్యసభలో విపక్షాల గందరగోళం, ఖర్గే ఆరోపణలు ఖండిస్తుం. ఈయన వ్యాఖ్యలు హాస్యాస్పదం, దురదృష్టకం. ఖార్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చిఆ నిరాకరిస్తున్నారు. పలుమార్లు చైర్మన్ చర్చించేందుకు ఛాంబర్ కు పిలిచినా వెళ్లలేదు. సభను సజావుగా కొనసాగించేందుకు కాంగ్రెస్ కు ఇష్టం లేనట్లుగా స్పష్టం అవుతుంది. సభ నడవలేదని నిరసనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అరాచకం సృష్టించేందుకు ప్రయ్నిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ పైనే మిమిక్రీ చేస్తూ గేళీ చేసిన ఈ పార్టీకి విలువలంటే ఏంటో తెలియవు. వీరిని వీరు ఇంకా కాలేజీ కుర్రాళ్లమనుకుంటున్నారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే: కాంగ్రెస్ – రాహుల్ గాంధీలకు 10 ప్రశ్నలు అడుగుతున్నా. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించే సంస్థతో రాహుల్ గాంధీకి సంబంధాలు ఏమిటి? సోనియా గాంధీ – జార్జ్ సోరోస్ మధ్య సంబంధం ఏంటీ? కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా – జార్జ్ సోరోస్ మధ్య సంబంధం ఏమిటి? సోరోస్ – గాంధీ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సోరోస్ అత్యధిక డబ్బు ఎందుకిచ్చాడు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌తో సోరోస్‌కు ఉన్న సంబంధం ఏమిటి? సోరోస్ ఈ నిధులను కాంగ్రెస్ పార్టీకి చెందిన 300మంది నాయకులకు ఎందుకిచ్చాడు? భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ ఎంత డబ్బు ఖర్చు చేసింది? ఈ యాత్రలో సోరోస్ ఫౌండేషన్ ఎంతిచ్చింది?
పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా: టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఇది సభా గౌరవ, మర్యాదలకు తగదు. సభ్యులెవరూ కులం, మతం, సమాజం, స్ర్తీ, పురుషుడు వంటి వాటిపై వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగొద్దు. బెనర్జీ తన వ్యాఖ్యలపై సభలో క్షమాపణలు చెప్పారు. లిఖిత పూర్వకంగా కూడా క్షమాపణలు కోరారు. దీన్ని ఇంతటితో వదిలేయాలి. సభలో మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సభ్యులు తమ వ్యాఖ్యలు సరళతరంగా ఉండేలా ప్రయత్నించాలి.
బీజేపీ ఎంపీ దినేష్ శర్మ: కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఎప్పుడూ చేసేది నియంత్రణ లేని ఆరోపణలే. అసలు ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? అనేది నా అనుమానం. అధికార పక్షం, ప్రభుత్వం చెబుతున్నా వినకపోవడం విచారకరం.
దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ తో కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ఏమిటీ సంబంధమని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో నిరసన తెలిపారు.