బడ్జెట్ పై ఆసక్తికర అంశాలు మీకు తెలుసా!
Do you know the interesting facts about the budget!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బడ్జెట్ గురించిన పలు ఆసక్తికర అంశాలు మీకు తెలుసా! పలు అంశాలను ఇక్కడ చదవండి.
ఎవరెవరు రూపొందిస్తారు!
బడ్జెట్ ను ఆర్థికమంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలు బడ్జెట్ రూపకల్పనలో పాల్గొంటారు.ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖలు తమ తమ కేటాయింపులను ప్రభుత్వానికి తెలియజేస్తాయి. నోడల్ ఏజెన్సీ వీటన్నింటినీ క్రోడీకరించి బడ్జెట్ ను రూపొందిస్తుంది. కేటాయింపులపై కేంద్ర ఆర్థిక శాఖ ఆయా మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, విభాగాలు, రక్షణ దళాలు తమ తమ అంచనాలను, డిమాండ్లను స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో వీరందరితో చర్చలు కూడా చేపడతారు. అనంతరం తుది బడ్జెట్ రూపకల్పనకు అంకురార్పణ చేస్తారు.
ఎవరెవరి అనుమతులు పొందాలి..
బడ్జెట్‌ను సమర్పించే తేదీ, అనుమతిపై పలువురి అనుమతిని పొందాల్సి ఉంటుంది. లోక్ సభ స్పీకర్, లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్, రాష్ట్రపతి, కేబినెట్ ల ఆమోదం పొందాల్సి ఉంటుంది.
భారత రాజ్యాంగంలోని 112 అధికరణ ప్రకారం బడ్జెట్ ను రూపొందిస్తారు.
బ్లాక్ బడ్జెట్: 1973-74 సంవత్సరపు బడ్జెట్‌ను బ్లాక్ బడ్జెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ ఏడాది దేశ బడ్జెట్ లోటు రూ. 550 కోట్లుగా నమోదు కావడం విశేషం.
రహాస్యంగా బడ్జెట్: బడ్జెట్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వం అత్యంత పకద్భందీగా చేపడుతుంది. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న అధికారులను ఏ ఒక్కరిని బయటకు వెళ్లనీయరు. ఇంటలిజెన్స్ బ్యూరో కూడా వీరందరిపై ఓ కన్నేసి ఉంచుతుంది. ఆయా కుటుంబాలకు ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితో కేంద్ర ప్రభుత్వ వర్గాలు పూర్తి సహాయాన్ని అందజేస్తాయి. బడ్జెట్ విడుదల వరకు వీరికి బయటి ప్రపంచంలో సంబంధాలు ఉండవు.
ముద్రణ
బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రెండు రోజుల ముందు మాత్రమే వాటిని ముద్రణకు పంపిస్తారు. సమాచారం గోప్యత కోసం ముద్రణ కార్యాలయం వద్ద హై సెక్యూరిటీని నియమిస్తారు. న్యూ ఢిల్లీలోని మెంట్ రోడ్ నార్త్ బ్లాక్ లో బడ్జెట్ పత్రాలను ప్రింటింగ్ చేస్తారు.
మార్పు చేర్పులు..
కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం బడ్జెట్ లోని పలు అంశాలను దూరం పెట్టింది. కరోనా కాలంలో హల్వా వేడుకను నిర్వహించకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అటు పిమ్మట రైల్వే బడ్జెట్ ను కూడా విలీనం చేశారు. బడ్జెట్ ను సాయంత్రం ప్రకటించనుండగా దాన్ని ఉదయానికి మార్చారు. ఫిబ్రవరిన బడ్జెట్ ను విడుదల చేయనుండగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మధ్యలో జూలైలో నిర్వహిస్తున్నారు. మొత్తానికి మోదీ నేతృత్వంలో బడ్జెట్ లో అనేక నూతన సంస్కరణలకు తెరతీశారు. నల్ల రంగు బ్యాగులో బడ్జెట్ పత్రాలను తీసుకువచ్చే విధానానికి స్వస్తి పలికి ఎర్ర రంగులో డిజిటలైజేషన్ ద్వారా బడ్జెట్ ను పార్లమెంట్ కు ఆర్థిక మంత్రి తీసుకువస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ ను పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. దీంతో గతంలో 20 నుంచి 30 పెట్టేల వరకు బడ్జెట్ పత్రాలు పార్లమెంట్ కు చేరుకుంటుండగా ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం రెండు చిన్నపాటి సంచులే కావడం గమనార్హం.