కమలం గెలుపై మార్కెట్ల ధీమా జూన్ 4న పైపైకి స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 25వేల పాయింట్లనుంచి 75వేల పాయింట్లకు పెట్టుబడిదారుల్లో నమ్మకం, వివ్వాసం పెంపొందించాం ఐదు ట్రిలియర్ డార్లకు మార్కెట్ క్యాప్ 4.5 కోట్లకు పెరిగిన డీమ్యాట్ ఖాతాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ సెంట్రల్ డెస్క్: బీజేపీ హయాంలో స్టాక్ మార్కెట్లు కొత్త పుంతులు తొక్కుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ప్రధాని మీడియాతో మాట్లాడారు. జూన్ 4న స్టాక్ మార్కెట్లు శిఖరాలకు చేరుకుంటాయన్నారు. అదేసమయంలో ప్రతిపక్షాలు మాత్రం నిరాజనకంగా ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు.
2014లో సెన్సెక్స్ 25వేల పాయింట్ల నుంచి 2024 నాటికి 75వేలకు చేరుకుందన్నారు. ఈ పెరుగుదల పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ మార్కెట్లపై పెట్టుబడిదారులు అద్భుతమైన నమ్మకాన్ని, పనితీరును కనబరుస్తున్నారని అభినందించారు.
వ్యాపార, వాణిజ్యాలపై పెట్టుబడులను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు కూడా దేశం చూస్తోందని మోదీ పేర్కొన్నారు. జూన్ 4న మార్కెట్లు గణాంకాలలో అత్యధిక స్థానానికి ఎగబాకుతాయని మోదీ తెలిపారు.
ఇటీవలే భారత మార్కెట్లు ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కు చేరుకున్నాయని తెలిపారు.
2014లో కోటి ఉన్న డీమాట్ ఖాతాలు2024 వరకు 4.5 కోట్లకు పెరిగాయని తెలిపారు. ప్రతీ భారతీయుడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులన్నదే తమ ఉద్దేశ్యమన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీదే చారిత్రక విజయమని స్టాక్ మార్కెట్ల తీరును చూస్తే ఇట్టే అర్థం అయిపోతుందన్నారు. నిఫ్టీ 50 శాతం మూడు రెట్లు పెరిగిందన్నారు. 2014లో 6900 పాయింట్లు ఉన్న నిఫ్టీ ఇండెక్స్ 2024 నాటికి 22,700కు పెరిగిందని తెలిపారు. బీఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని మే 21న కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని వివరించారు.
బెర్న్‌స్టెయిన్ తాజా పరిశోధన ప్రకారం ఎన్డీయే అధికారంలోకి వస్తే ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్ స్వల్పకాలిక వృద్ధిని సాధిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉత్పత్తి తదితర రంగాలు ముందుంటాయని భావిస్తున్నారు. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం సెషన్‌ను సానుకూలంగా ముగిసిన విషయం తెలిసిందే.