దక్షిణ కొరియాలో కొనసాగుతున్న నిరసనలు

Protests continue in South Korea

Dec 4, 2024 - 14:47
 0
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న నిరసనలు

అధ్యక్షుడు యూన్​ యోల్​ రాజీనామాకు డిమాండ్​
పార్లమెంట్​ లో అభిశంసన
తొలిసారి ఎమర్జెన్సీ ప్రకటన, ఉపసంహరణ!

సియోల్​: ఎట్టకేలకు విపక్షాల దేశవ్యాప్త నిరసనలు, డిమాండ్లతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్​  యోల్​ ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు. మంగళవారం అర్థరాత్రి మార్షల్​ లా ను ఉపసంహరించే ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో విపక్ష పార్టీలు సంబురాలు చేసుకున్నాయి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన గంట సేపటికే మల్లీ నిరసనల పర్వం మొదలైంది. నిరసనకారులు యోల్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. పార్లమెంట్​ లో యోల్​ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారం లేదా శనివారం ఓటింగ్​ నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష పార్టీ డీపీకే తెలిపింది. 
దక్షిణ కొరియాలో 300 ఎంపీ సీట్లున్నాయి. అభిశంసన తీర్మాణం నెగ్గాలంటే 200 ఓట్లు అవసరం. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ వద్ద 192 ఓట్లు (సీట్లు) ఉన్నాయి. అధికార పార్టీ ఎంపీలు రాష్ర్టపతికి వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్ప అభిశంసన నెగ్గడం కష్టమే. అనంతరం ఈ తీర్మాన కాపీని కోర్టుకు సమర్పించనున్నారు. 9మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు రాష్​ర్టపతికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తేనే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది.  అభిశంసన నెగ్గితే 60 రోజుల్లోపు దక్షిణ కొరియా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో రాష్​ర్టపతి అధికారులను కూడా ప్రధాని చేపడతారు. 
దక్షిణ కొరియా డెమోక్రటిక్​ కంట్రీగా రూపుదిద్దుకున్నాక ఎమర్జెన్సీ విధించడం ఇది తొలిసారి.