బంగ్లాలో దాడులు బ్రిటన్​ ఎంపీల ఆందోళన

British MPs are concerned about the attacks in the bungalow

Dec 4, 2024 - 14:45
 0
బంగ్లాలో దాడులు బ్రిటన్​ ఎంపీల ఆందోళన

లండన్​: బ్రిటీష్​​ పార్లమెంట్​ లో బంగ్లాదేశ్​ లో హిందువులపై దాడులను ప్రతిపక్ష కన్జర్వేటివ్​ ఎంపీలు బాబ్ బ్లాక్​ మన్​, కేథరీన్​ లు ఖండించారు.  దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందువులను తుడిచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. బంగ్లాదేశ్​ ను విముక్తి చేయడంలో బ్రిటన్​ పాత్ర ఉందని, ప్రస్తుతం చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా బ్రిటన్​ కు ఉందని అన్నారు. గత నెలలో తాను బంగ్లాదేశ్​ పర్యటనకు వెళ్లానని ఎంపీ కేథరీన్​ అన్నారు. అప్పుడు మైనార్టీల ప్రయోజనాలను రక్షిస్తానని తాత్కాలిక ప్రధాని యూనస్​ హామీ ఇచ్చారన్నారు. హింసాత్మక ఘటనలను ప్రభుత్వం ఆపలేకపోతుందని మరో ఎంపీ ప్రీతీ పటేల్​ అన్నారు. బంగ్లాలో పరిస్థితిని బ్రిటీష్​ ప్రభుత్వం గమనిస్తుందని ఎంపీ బారీ గాడినర్​ పేర్కొన్నారు. 

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యం, ప్రాథమిక హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు.