బంధాల బలోపేతానికి.. గ్రీస్​ ప్రధానితో మోదీ ఫోన్​ సంభాషణ

Modi's phone conversation with the P.M. of Greece

Nov 2, 2024 - 14:26
 0
బంధాల బలోపేతానికి.. గ్రీస్​ ప్రధానితో మోదీ ఫోన్​ సంభాషణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–గ్రీస్​ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ప్రధాని మోదీ ప్రధాని కిరియాకోస్​ మిత్సోటాకిస్​ తో ఫోన్​ లో మాట్లాడారు. ప్రధాని సంభాషణ సారాంశాన్ని పీఎంవో కార్యాలయంలో శనివారం ప్రకటించింది. భారత్​ పశ్చిమాసియా యూరప్​ ఎకనామిక్​ కారిడార్​ పై సుదీర్ఘ చర్చించారు. మరింత పురోగతి కోసం నిబద్ధత పనిచేయాలని నిర్ణయించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. గ్రీస్​ ఎన్నికలలో ప్రధానిగా ఎన్నికైనందుకు మిత్సోటాకిస్​ ను పీఎం మోదీ అభినందనలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, షిప్పింగ్​, కనెక్టివిటీ సహా ద్వైపాక్షిక సహకారం లాంటి అనేక రంగాలలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఐఎంఈఈసీ (ఇండియా వెస్ట్​ ఆసియా యూరప్​ ఎకనామిక్​ కారిడార్​), పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలు, సమస్యలు లాంటి అనేక అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటనలో వివరించింది.