సమ్మె విరమించిన వైద్యులు
21వ తేదీ నుంచి విధుల్లోకి విలేఖరులతో ఆర్జీకర్ జూనియర్ వైద్యులు
కోల్‌కతా: కోల్ కతామెడికో అత్యాచారం, హత్యపై నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్జీకర్ వైద్య కళాశాల జూనియర్ వైద్యులు విధుల్లో చేరనున్నారు. రాష్ర్ట ప్రభుత్వంతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 21వతేదీ నుంచి విధులకు హాజరవుతామని శుక్రవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. సమ్మెను ముగించే ముందు స్వాస్త్య భవన్ సీజీవో కాంప్లెక్ సీబీఐ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఒకవేళ రాష్ర్ట ప్రభుత్వం తమ డిమండ్లను నెరవేర్చకుంటే సమ్మె చేపడతామని హెచ్చరించారు. అదే సమయంలో తమ పోరాటం ఇంకా ముగిసిపోలేదన్నారు. మమత ప్రభుత్వానికి ఒక వారం సమయం ఇస్తున్నామన్నారు. ఈలోగా హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 41 రోజులుగా వైద్యులు సమ్మెను కొనసాగిస్తున్నారు.