మెడికో హత్య.. ఐఎంఏ దేశవ్యాప్త నిరసనలు

ఔట్​ పెషేంట్లకు అందని వైద్య సేవలుకోల్​ కతా:

Aug 17, 2024 - 14:06
 0
మెడికో హత్య.. ఐఎంఏ దేశవ్యాప్త నిరసనలు

కోల్​ కతా: ఆర్జీకర్​ మెడికో హత్యపై దేశవ్యాప్తంగా ఐఎంఏ (ఇండియన్​ మెడికల్​ అసిసోయేషన్​) ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైద్యులు ఆందోళనలు, నిరసనలకు దిగారు. దీంతో దేశ వ్యాప్తంగా రోగులకు అత్యవసర సేవలు మినహా అన్నిచోట్ల ఓపీ సేవలు నిలిచిపోయాయి. శనివారం సమ్మె చేస్తామని ఐఎం ప్రకటించింది. మెడికో హత్యపై రాష్​ర్ట ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుందని వైద్య యూనియన్​ ఆరోపించింది. అసలు నిందితులను తప్పించి ఏం తెలియని వారిని ఇరికించే కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించింది. ఈ నిరసనలకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కూడా మద్ధతునీయడంతో ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయి ఔట్​ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి మొదలైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగించనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది.